ఢిల్లీ పేలుడుకు ముందు ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి అరెస్ట్

ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ప్రధాన అరెస్టు చేసింది.

By -  Knakam Karthik
Published on : 26 Nov 2025 11:19 AM IST

National News, Delhi, Delhi Red Fort bomb blast, National Investigation Agency

ఢిల్లీ పేలుడుకు ముందు ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి అరెస్ట్

ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ప్రధాన అరెస్టు చేసింది. ఫరీదాబాద్‌కు చెందిన వ్యక్తి సోయబ్‌ను, ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించినందుకు ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ధౌజ్ ప్రాంతానికి చెందిన సోయబ్ ఈ కేసులో అరెస్టైన ఏడవ నిందితుడు. నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడికి ముందు ఉగ్రవాది ఉమర్‌కు లాజిస్టిక్ సహాయం అందించినట్టు విచారణలో బయటపడింది. ఆ దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.

ఈ కేసు (RC-21/2025/NIA/DLI)లో ఉమర్‌కు కీలక సహాయకులుగా వ్యవహరించిన మరో ఆరుగురిని ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది. స్యూసైడ్ బాంబింగ్‌కు సంబంధించిన అనేక కోణాల్లో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ శోధనలు చేపట్టి, దాడిలో పాలుపంచుకున్న ఇతరులను గుర్తించి పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం కుట్రను వెలికితీయడానికి ఎన్ఐఏ కృషి కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.

Next Story