ఢిల్లీ మేయర్ పీఠం ద‌క్కించుకున్న‌ 'ఆప్‌'..!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది

By Kalasani Durgapraveen  Published on  14 Nov 2024 1:50 PM GMT
ఢిల్లీ మేయర్ పీఠం ద‌క్కించుకున్న‌ ఆప్‌..!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. కొత్త మేయర్‌గా ఆప్‌కి చెందిన మహేష్‌కుమార్‌ ఖిచి నియమితులయ్యారు. ఆ ఎన్నికల్లో ఆప్‌కు 133 సీట్లు వచ్చాయి. బీజేపీకి 130 ఓట్లు వచ్చాయి. కౌన్సిలర్లలో 8 మంది క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తుంది.

మహేష్ కుమార్ ఖిచి(46) ప్రస్తుతం కరోల్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని దేవ్ నగర్ వార్డు నుండి కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆయ‌న‌ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మోతీలాల్ నెహ్రూ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. ఖేడీ షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. MCDలో మేయర్ పదవి షెడ్యూల్డ్ కులాల అభ్యర్థికి రిజర్వ్ చేయబడింది.

ఆమ్ ఆద్మీ పార్టీ తరపున బరిలోకి దిగిన దళిత అభ్యర్థి ఖిచి మూడు ఓట్ల స్వల్ప తేడాతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కిషన్ లాల్‌పై విజయం సాధించారు. ఖిచికి 133 ఓట్లు రాగా.. లాల్‌కు 130 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్లు చెల్లవని ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు.

Next Story