కర్నాటక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటుకోబోతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. అంతే పాటు.. జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. అసెంబ్లీలో ప్రసంగించిన అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ప్రకటించారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడింది. ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే.. కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో నగదు, ఇతర వనరుల దుర్వినియోగం నివారించడానికి తనిఖీలను నిర్వహిస్తారు. పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల తేదీని కూడా భారత ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. జలంధర్ ఉప ఎన్నికల తేదీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. మే 10న జలంధర్‌లో ఓటింగ్, మే 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రకటన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.