కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆదివారం రాంలీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ మెగా ర్యాలీకి పిలుపునిచ్చింది. దీంతో ర్యాలీ జరిగే ప్రదేశం, చుట్టుపక్కల ఢిల్లీ పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ర్యాలీ ద్వారా కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రజల ఓటును ప్రధాని అవమానించారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశం మొత్తం ఢిల్లీ ప్రజల వెంట ఉంది. 140 కోట్ల మంది కలిసి రాజ్యాంగాన్ని కాపాడుతారన్నారు.
ఢిల్లీలో నియంతృత్వాన్ని అమలు చేసినట్లే రేపు బెంగాల్, రాజస్థాన్‌లకు కూడా తీసుకువస్తారన్నారు. బీజేపీ వాళ్లు నన్ను రోజూ దూషిస్తున్నారని ఢిల్లీ సీఎం అన్నారు. ఢిల్లీని అవమానించడాన్ని సహించలేను. దేశ ప్రజలంతా ఢిల్లీ వెంటే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఆర్డినెన్స్‌ను తిరస్కరిస్తూనే ఉంటాం. ఇది మోదీజీ తొలి దాడి అని నాకు తెలిసింది. రేపు ఇతర రాష్ట్రాలకు కూడా అదే ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతమైపోతోందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
సుప్రీంకోర్టు ఢిల్లీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుప్రీంకోర్టును ఎందుకు అంగీకరించరు? ఎన్నికైన ప్రభుత్వానికి పని చేసే హక్కు ఉండాలి. నేడు రాజ్యాంగాన్ని కాపాడే ఉద్యమం ప్రారంభమయిందన్నారు. తాము 12 ఏళ్ల క్రితం రాంలీలా మైదాన్‌లో సమావేశమయ్యామని.. నియంతృత్వాన్ని అంతం చేసేందుకు మళ్లీ సమావేశమనట్లు పేర్కొన్నారు. ఈ వేదికపై నుంచే అవినీతిపై పోరాటం సాగింది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం ప్రారంభించి గెలుస్తామన్నారు.