ఎమ్మెల్యే బ‌ల్జింద‌ర్ కౌర్ ను కొట్టిన భ‌ర్త‌.. వీడియో వైర‌ల్‌.. రంగంలోకి దిగిన మ‌హిళా క‌మిష‌న్

AAP MLA Baljinder Kaur assaulted at home in Punjab. ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. ఎమ్మెల్యే పై ఆమె భ‌ర్త చేయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sept 2022 11:51 AM IST
ఎమ్మెల్యే బ‌ల్జింద‌ర్ కౌర్ ను కొట్టిన భ‌ర్త‌.. వీడియో వైర‌ల్‌.. రంగంలోకి దిగిన మ‌హిళా క‌మిష‌న్

దేశంలో మ‌హిళ‌ల‌పై ఇటీవ‌ల నేరాలు పెరుగుతున్నాయ‌ని జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రెండు రోజుల క్రితమే ఓ నివేదిక విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో 17శాతం నేరాలు పెరిగిన‌ట్లు అందులో పేర్కొంది. ఓ వైపు ఆ నివేదిక‌పై చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వ‌చ్చింది. ఓ ఎమ్మెల్యే పై ఆమె భ‌ర్త చేయి చేసుకున్న వీడియో అది. రెండు నెల‌ల క్రిత‌మే ఆ ఘ‌ట‌న జ‌రుగగా తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

పంజాబ్ రాష్ట్రంలోని తాల్వండి సాబో నియోజ‌వ‌ర్గ ఎమ్మెల్యేగా ఆప్ పార్టీకి చెందిన బ‌ల్జింద‌ర్ కౌర్ విజ‌యం సాధించారు. ఆమె భ‌ర్త పేరు సుఖ్‌రాజ్ సింగ్‌. ఇటీవ‌ల వారి మ‌ధ్య ఏదో కార‌ణం చేత గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆగ్ర‌హానికి లోనైన సుఖ్‌రాజ్ సింగ్ అంద‌రూ చూస్తుండ‌గానే బ‌ల్జింద‌ర్ కౌర్ పై చేయి చేసుకున్నాడు. అక్క‌డ ఉన్న వారు వెంట‌నే ఆయ‌న్ను ప‌క్క‌కు తీసుకువెళ్లారు. ఈ ఘ‌ట‌న జూలై 10న చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ వీడియోని పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు బ్రింద‌ర్ త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ విచారం వ్య‌క్తం చేశారు. ఇక‌నైనా పురుషుల ఆలోచ‌నాధోర‌ణి మారాల‌ని రాసుకొచ్చారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై పంజాబ్ మ‌హిళా క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనిని సుమోటోగా స్వీక‌రించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే ఓమ‌హిళ‌ ఇంట్లో వేదింపుల‌కు గురి కావ‌డం బాదాక‌రం అని పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి అన్నారు. కాగా.. దీనిపై బ‌ల్జింద‌ర్ కౌర్ స్పందించ‌లేదు. పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేద‌ని స‌మాచారం.

Next Story