ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉంటే భారత పౌరసత్వం రాదు

ప్రభుత్వ అధికారుల నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర పత్రాలను పొందిన బంగ్లాదేశ్ వలసదారుడిపై మహారాష్ట్ర పోలీసులు గత సంవత్సరం కేసు నమోదు చేశారు.

By Medi Samrat
Published on : 13 Aug 2025 8:45 PM IST

ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉంటే భారత పౌరసత్వం రాదు

ప్రభుత్వ అధికారుల నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర పత్రాలను పొందిన బంగ్లాదేశ్ వలసదారుడిపై మహారాష్ట్ర పోలీసులు గత సంవత్సరం కేసు నమోదు చేశారు. 1955 పౌరసత్వ చట్టం భారత పౌరుడిగా ఎవరిని గుర్తించాలో నియంత్రించే ప్రాథమిక చట్టం అని బాంబే హైకోర్టు పేర్కొంది.

“కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ఓటరు ఐడి కలిగి ఉండటం వల్ల ఎవరైనా భారత పౌరుడిగా మారరు” అని హైకోర్టు తేల్చి చెప్పింది. “ఈ పత్రాలు గుర్తింపు కోసం లేదా సేవలను పొందడానికి ఉద్దేశించినవి, అవి చట్టం కింద పౌరసత్వం, ప్రాథమిక చట్టపరమైన అవసరాలకు సంబంధించింది కాదు” అని కూడా కోర్టు అభిప్రాయపడింది.

Next Story