Video: ప్రయాగ్‌రాజ్‌లో చెరువులో కూలిపోయిన IAF శిక్షణ విమానం..ఇద్దరు పైలట్లు సేఫ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆర్మీకి చెందిన మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది

By -  Knakam Karthik
Published on : 21 Jan 2026 4:52 PM IST

National News, Uttar Pradesh, Prayagraj, Indian Air Force, Trainee Aircraft Crashes

Video: ప్రయాగ్‌రాజ్‌లో చెరువులో కూలిపోయిన IAF శిక్షణ విమానం..ఇద్దరు పైలట్లు సేఫ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆర్మీకి చెందిన మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. సాధారణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎగురుతున్న సమయంలో, స్థానిక కేపీ కాలేజీ సమీపంలో ఉన్న ఒక చెరువులో ఈ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారని, వారు ఇద్దరూ సురక్షితంగా బయటపడినట్లు స్పష్టం చేశారు. ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అలాగే సమీపంలోని పౌరుల ఆస్తులకు కూడా హాని కలగలేదని వెల్లడించారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదన్నారు. ఇదిలా ఉండగా, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానాలు తరచుగా ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో, ఇందుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఎయిర్ ఫోర్స్ కోర్టు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

Next Story