భయంతో మొబైల్‌ మింగిన ఖైదీ.. చివరకు

A prisoner swallowed a mobile phone because he was afraid that the constable would see him.. Incident in Bihar. జైల్లో ఖైదీల దగ్గర ఫోన్లు దొరికిన ఘటనలు ఇటీవల తరచూ తెరపైకి వస్తున్నాయి.

By అంజి  Published on  19 Feb 2023 8:44 AM GMT
భయంతో మొబైల్‌ మింగిన ఖైదీ.. చివరకు

జైల్లో ఖైదీల దగ్గర ఫోన్లు దొరికిన ఘటనలు ఇటీవల తరచూ తెరపైకి వస్తున్నాయి. జైలు పోలీసుల అండతోనో, పోలీసుల కంట పడకుండానో జైలులో ఉన్న ఖైదీలు మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేస్తూ ఉన్నారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ మండల్ జైలు నుంచి ఇలాంటి కేసు ఒకటి తెరపైకి వచ్చింది. ఇక్కడ డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ వద్ద మొబైల్ ఫోన్ ఉంది. కానిస్టేబుల్ భయం నుంచి దాక్కోవడానికి హడావుడిగా మొబైల్ ఫోన్ మింగేశాడు. కొద్దిసేపటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆసుపత్రిలో ఎక్స్‌రేలో అతని కడుపులో మొబైల్ ఫోన్ స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం సదర్ ఆసుపత్రిలో ఖైదీ కైసర్ అలీకి చికిత్స కొనసాగుతోంది.

గోపాల్‌గంజ్‌లో కైసర్‌ అలీ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడు ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో కైసర్‌ మొబైల్‌ ఫోన్‌ వాడేవాడు. శనివారం రాత్రి అతను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండగా.. అదే సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వచ్చాడు. కానిస్టేబుల్ రావడం చూసి కైసర్ అలీ భయపడి మొబైల్ ఫోన్ మింగేశాడు. కొద్దిసేపటికే కడుపులో తీవ్రమైన నొప్పి మొదలైంది. కడుపునొప్పి గురించి జైలు అడ్మినిస్ట్రేషన్‌కి చెప్పి మొబైల్‌ను మింగినట్లు చెప్పాడు. ఇది విని జైలు సిబ్బంది షాకయ్యారు. హుటాహుటిన అతడిని చికిత్స నిమిత్తం సదరు ఆసుపత్రికి తరలించారు.

పట్టుబడతామనే భయంతో ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. విపరీతమైన కడుపునొప్పి రావడంతో శనివారం రాత్రి సదర్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. వైద్యులు అతడిని పరీక్షించగా కడుపులో ఫోన్‌ కనిపించింది. సదర్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో నియమించబడిన డాక్టర్ సలాం సిద్ధిఖీ, ఖైదీ కైసర్ అలీని కడుపు నొప్పి ఫిర్యాదుతో మండల్ జైలు నుండి తీసుకువచ్చినట్లు చెప్పారు. అతడి పొట్టకు ఎక్స్‌రే తీయగా.. అందులో ఫోన్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఎంక్వైరీ చేయగా.. దొరికిపోతానేమోనన్న భయంతో మొబైల్‌ను మింగినట్లు తేలింది.

కైసర్ అలీ తండ్రి పేరు బాబుజాన్ మియాన్. అతను ఇంరద్వా రఫీ గ్రామ నివాసి. జనవరి 17, 2020న, హాజియాపూర్ గ్రామ సమీపంలో కైసర్‌ను స్మాక్ (నార్కోటిక్ పదార్థం)తో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి మండల్‌ జైలులో ఉన్నారు.

Next Story