ఉత్తరప్రదేశ్ ఖుషీనగర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక వింతైన వ్యాధితో జన్మించింది. బాలిక చిన్నప్పటి నుండి కడుపునొప్పితో బాధపడుతోంది. అప్పటి నుండి బాలికకు కడుపు నొప్పి రావడానికి గల కారణాలను డాక్టర్లు కనుగొనలేకపోయారు. బాలిక తల్లిదండ్రులు మూఢనమ్మకాల పేరుతో బాలికను బాబాల దగ్గరికి తీసుకెళ్లేవారు. అయినా కూడా బాలికకు కడుపు నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. ఆ నొప్పి వయస్సు పెరిగే కొద్ది తీవ్రమవుతూ వచ్చింది. కాగా ఇటీవల ముంబైకి చెందిన వైద్యులు బాలికకు సోనోగ్రఫీ పరీక్షలు చేసి కడుపు నొప్పికి గల కారణాలు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు.
బాలిక కడుపులో పెరుగుతున్నది గడ్డ కాదని, అది ఒక తల, కళ్లు, చేతులు, కాళ్లు ఉన్న మృత శిశువు అని చెప్పారు. బాలిక పుట్టినప్పటి నుండే కడుపులో శిశువు సైతం ఉందని, అప్పటి నుండి అది పెరుగుతూ వచ్చిందని వైద్యులు తెలిపారు. తమ కూతురు కడుపు నొప్పితో బాధపడిన ప్రతిసారీ తల్లిదండ్రులు చిన్న చిన్న ఆస్పత్రుల చుట్టూ, బాబాల దగ్గరకి వెళ్లి చూపించేవారు. అయితే ఎంతకు నొప్పి తగ్గకపోవడంతో బాలిక రోష్ని తల్లిదండ్రులు ముంబైలోని సియాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
బాలిక కడుపు నొప్పిపై వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఎట్టకేలకు విజయవంతంగా బాలిక కడుపులో ఉన్న మృతశిశువును బయటకు తీశారు. ఇలాంటి సందర్భాల్లో బిడ్డ పుట్టే ఛాన్స్‌లు తక్కువ అని వైద్యులు చెప్పారు. బాలికకు సరైన వైద్యం అందించకుండా.. మూఢనమ్మకాలతో చిన్నారి ప్రాణాలను ప్రమాదంలో నెట్టారని బాలిక ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ పరాస్ కొఠారి తెలిపారు. ఇక బాలిక అందరిలాగే జీవించగలుగుతుందని డాక్టర్ జోషి తెలిపారు.