ఆరుగురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లి.. తండ్రి భావోద్వేగం.!

A father who married six daughters at once. వధూవరుల తల్లిదండ్రులు తమ ఇంట్లో జరిగే పెళ్లి వేడుక చూసి ఊరంతా చెప్పుకోవాలని అనుకుంటారు. కానీ రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుక గురించి ఇప్పుడు దేశమంతా చెప్పుకుంటున్నారు.

By అంజి  Published on  27 Nov 2021 4:40 PM IST
ఆరుగురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లి.. తండ్రి భావోద్వేగం.!

వధూవరుల తల్లిదండ్రులు తమ ఇంట్లో జరిగే పెళ్లి వేడుక చూసి ఊరంతా చెప్పుకోవాలని అనుకుంటారు. కానీ రాజస్థాన్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుక గురించి ఇప్పుడు దేశమంతా చెప్పుకుంటున్నారు. ఝున్‌ ఝున్‌ జిల్లా ఖేతడీలో జరిగిన ఓ పెళ్లి వేడుక ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన ఆరుగురు కుమార్తెలకు తండ్రి ఒకేసారి పెళ్లి చేశాడు. తండ్రి రోహితాక్షవ్‌ స్కూల్‌ బస్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఏడుగురు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. ఇక వీరిలో ఆరుగురు కుమార్తెలు పెళ్లి ఈడుకు వచ్చారు. దీంతో వారికి పెళ్లి చేయాలని రోహితాక్షవ్‌ అనుకున్నాడు. వెంటనే ఇద్దరు చొప్పున అన్నదమ్ములు ఉన్న ఓ కుటుంబంతో తన ఆరుగురు కుమార్తెలకు పెళ్లి సంబంధం చూశాడు.

హర్యానాకు చెందిన నరేశ్‌, భైరూసింగ్‌తో పెద్ద కూతురు మీనా దుఖేరా, మూడో కూతురు సీమాల పెళ్లి జరిగింది. అలాగే రెండవ కూతురు అంజు, నాల్గో కూతురు నిక్కీలకు నీమ్‌కాఠాణాకు చెందిన ధర్మవీర్‌, విజేంద్రలతో వివాహం జరిగింది. అదే విధంగా కుతానియాకు చెందిన ప్రదీప్‌, మోహిత్‌లతో యోగితా, సంగీతల పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకను రోహితాక్షవ్‌ ఎంతో ఘనంగా జరిపించాడు. బారాత్‌లో పెళ్లి కూతుళ్లు పసుపు దుస్తులు ధరించి స్టెప్పులు వేశారు. కుటుంబ సభ్‌యులతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. సామాజిక సేవలో కూడా ఈ నూతన వధువులు ముందుండే వారు. సోదరుడు వికాస్‌ గుర్జాన్‌ ఆధ్వర్యంలో కరోనాటైమ్‌లో మాస్కులు కుట్టి గ్రామ ప్రజలకు పంచారు. ఒకేసారి ఆరుగురు కుమార్తెలకు తండ్రి రోహితాక్షవ్‌, కుటుంబ సభ్యులు ఓ వైపు ఆనంద పడుతూ మరో వైపు భావోద్వేగానికి లోనయ్యారు.

Next Story