దేశంలో రోజురోజుకు నేరాల ఘటనలు పెరిగిపోవడం మనందరం చూస్తున్నదే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లోని ఓ పాఠశాలలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని పట్ల ప్రిన్సిపాల్ ఆటవికంగా ప్రవర్తించాడు. స్కూల్‌కు రెండు జడలు వేసుకురాలేదన్న కారణంతో.. ప్రధానోపాధ్యాయుడు బాలిక తరగదిలోకి లాక్కెళ్లి జుట్టు కత్తిరించాడు. అంతేకాదు ఆమెను దుర్భాషలాడాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో ప్రిన్సిపాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై విద్యార్థిని జిల్లా మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం కూడా ఇచ్చింది. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ప్రిన్సిపాల్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, అయితే పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని విద్యార్థిని ఆరోపించింది. ఈ ఆటవిక ఘటన ఫరూఖాబాద్‌లోని నవాబ్‌గంజ్ బ్లాక్‌లోని నెక్రామ్ నగర్ కోకాపూర్ గ్రామంలో జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని.. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాడు అసభ్యకరంగా తిట్టాడని, రెండు జడలు వేయలేదని జుట్టు కత్తిరించాడని ఆరోపించింది.
ప్రిన్సిపాల్ సుమిత్ యాదవ్ ప్రతిరోజూ 9 నుండి 12వ తరగతి చదువుతున్న బాలికలతో అసభ్యకర చర్యలకు పాల్పడేవాడని తెలిసింది. నిందితుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపాల్ గతంలోనూ ఇతర బాలికల జుట్టు కత్తిరించారని విద్యార్థి ఆరోపించింది. ఫిర్యాదుదారు ప్రకారం.. ప్రిన్సిపాల్ బాలికలందరికీ రెండు జడలతో పాఠశాలకు వెళ్లడం తప్పనిసరి చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడు ప్రిన్సిపాల్ సుమిత్ యాదవ్‌పై కేసు నమోదు చేసినట్లు మేరాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు.