షాకింగ్.. వారం రోజుల్లో 98 మంది గుండెపోటుతో మృతి
98 people died of heart attack in a week in Kanpur. ఆ లెక్కలు షాక్ ఇచ్చేంత భయానకంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత ఐదు రోజుల్లో
By అంజి Published on 9 Jan 2023 4:15 AM GMTఆ లెక్కలు షాక్ ఇచ్చేంత భయానకంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత ఐదు రోజుల్లో గుండె, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 98 మంది మరణించారు. 98 మరణాలలో, 44 మంది ఆసుపత్రిలో మరణించారు. 54 మంది రోగులు చికిత్సకు ముందు మరణించారు. ఈ గణాంకాలను LPS ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అందించింది. కాన్పూర్‌లోని లక్ష్మీపత్ సింఘానియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ కార్డియాక్ సర్జరీ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత వారంలో 723 మంది హృద్రోగులు ఆసుపత్రిలోని అత్యవసర, ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చారు.
తీవ్రమైన జలుబుతో బాధపడుతున్న 14 మంది రోగులు శనివారం గుండెపోటుతో మరణించగా, హార్ట్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. ఇన్‌స్టిట్యూట్‌లో ఎనిమిది మంది చనిపోయారు. కాన్పూర్ నగరంలోని ఎస్‌పిఎస్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో గడిచిన 24 గంటల్లో 14 మంది రోగులు మరణించారు. హార్ట్ డిసీజ్ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 604 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 54 మంది కొత్త రోగులు, 27 మంది పాత రోగులు ఉన్నారు.
ఈ వాతావరణంలో రోగులకు చలి నుంచి రక్షణ కల్పించాలని కార్డియాలజీ డైరెక్టర్ వినయ్ కృష్ణ అన్నారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU)లోని ఫ్యాకల్టీ సభ్యుడు మాట్లాడుతూ.. ''ఈ చల్లని వాతావరణంలో గుండెపోటు వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. టీనేజర్లు కూడా గుండెపోటుకు గురైన సందర్భాలు మనకు ఉన్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వెచ్చగా ఉండాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి'' అని అన్నారు.