బాలి విమానాశ్రయంలో నాటకీయంగా అరెస్టు చేసి, ఆ తర్వాత భారతదేశానికి తీసుకుని వచ్చారు అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ను. అరెస్ట్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత అతడి మొదటి ఫోటో బయటకు వచ్చింది. రాజన్ మంచి ఆరోగ్యంతో ఉన్నారు. రాజన్ ప్రస్తుతం తీహార్ జైలులోని జైలు నంబర్ 2లో అత్యంత భద్రతతో కూడిన సెల్‌లో ఉన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రాజన్ మరణం గురించి పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అతడు బాగానే ఉన్నాడంటూ అధికారులు కీలక ప్రకటన చేశారు.
దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ గ్యాంగ్ ల నుండి రాజన్ బెదిరింపులను ఎదుర్కొంటూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో జైలులోనే రాజన్ ను చంపేస్తామని బెదిరించారు. అక్టోబరు 2015లో భారతదేశానికి రప్పించినప్పటి నుండి రాజన్ తీహార్ జైలులో ఉన్నాడు. మే 2020లో, తీహార్ జైలులో అత్యాచార నిందితుడికి కరోనా వైరస్ సోకింది. బీహార్ మాఫియా డాన్-టర్న్-పొలిటీషియన్ షహబుద్దీన్ కూడా కరోనాతో మరణించాడు. అయితే రాజన్ బాగోగులపై అధికారులు నోరు మెదపలేదు. 90వ దశకంలో అండర్ వరల్డ్ కు రాజన్ నాయకత్వం వహించాడు. దావూద్‌తో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. 1993 పేలుళ్ల తర్వాత రాజన్, దావూద్ విడిపోయారు.