కరోనాతో 89 మంది వైద్యులు మృతి.. రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌

89 doctors have succumbed to COVID-19 in Tamilnadu. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 89 మంది మృతి చెందినట్లు తేలిందని భారత వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

By Medi Samrat
Published on : 5 Feb 2021 5:10 PM IST

89 doctors have succumbed to COVID-19 in Tamilnadu.
కరోనా మహమ్మారి ఇంకా కట్టడి రాలేకపోతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టినా.. కొన్ని రాష్ట్రాల్లో కేసులు తీవ్రంగానే ఉన్నాయి. కేరళ, మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 89 మంది మృతి చెందినట్లు తేలిందని భారత వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాధితులకు చికిత్స చేసే ప్రయత్నంలో వైరస్‌ సోకి 89 మంది వైద్యులు మరణించారని వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జయలాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా నివారణలో భాగంగా 162 మంది వైద్యులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి రాజ్యసభకు వివరించారని, ఇందులో వాస్తవం లేదని అన్నారు. విధుల్లో పాల్గొంటున్న కరోనా వారియర్స్‌కు కేంద్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వైద్యులను గౌరవించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు అనే తేడా లేకుండా మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


కాగా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రచురించిన గణాంకాల ప్రకారం.. తమిళనాడులో కరోనాతో మరణించిన వారిలో ఎక్కువగా 37 మంది 60 ఏళ్ల వయసు ఉన్నవారేనని, ఇక 50 ఏళ్ల వయసులో ఉన్న 21 మంది, 70 ఏళ్ల వయసు ఉన్న 18 మంది ఉన్నారు. వారిలో కనీసం 40 మంది సాధారణ అభ్యాసకులు, 30 మంది వరకు చెన్నైకి చెందిన వారున్నారు.

కాగా, గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి విజయభాస్కర్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్నచర్యలను ప్రపంచ దేశాలు సైతం ప్రశంసిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లు, వైద్యులు సహా 1.30 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశామని అన్నారు. మలివిడతగా 50 ఏళ్లకు పైబడిన 8.53 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు చెప్పారు.


Next Story