ఆ గదిలోనే మలమూత్ర విసర్జన చేసేవాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది.
By - Medi Samrat |
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. ఈ విచారణలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి వచ్చిన అత్యంత ప్రమాదకరమైన వాస్తవం 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్', దీని కింద వరుస పేలుళ్లను ప్లాన్ చేసి, ఆత్మాహుతి బాంబర్లను సిద్ధం చేయడానికి ప్రయత్నించారు.
NIA దర్యాప్తులో పేలుడుకు సంబంధించిన ఉగ్రవాదుల గురించి చాలా ముఖ్యమైన ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా చాలా మందిని అరెస్టు చేశారు. చాలా మందిని విచారిస్తున్నారు. కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ ఫరీదాబాద్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడని, పేలుడుకు ముందు 10 రోజుల పాటు ఆ గదిలోనే తాళం వేసి ఉన్నాడని విచారణలో తేలింది.
ఈ 10 రోజుల్లో యూత్ ను బ్రెయిన్ వాష్ చేసేలా ఎన్నో విష యాలు వీడియోలు చేసి రాడికల్ యూత్ కి పంపించాడు. నూహ్‌లోని హిదాయత్ కాలనీలో ఉగ్రవాది ఉమర్ అద్దెకు తీసుకున్న గది నుంచి బయటకు రాలేదని విచారణలో తేలింది. ఆ గదిలోనే మలమూత్ర విసర్జన చేసి అక్కడ అపరిశుభ్రతను వ్యాపింప జేశాడు. ఆత్మాహుతి బాంబర్‌గా మారేందుకు శిక్షణ ఇచ్చేందుకే ఇలా చేశాడని భావిస్తున్నారు. తద్వారా అతని మనస్సు లక్ష్యంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది.
దర్యాప్తు సంస్థల మూలాల ప్రకారం.. ఉగ్రవాది ఉమర్ నబీ 10 రోజుల్లో 70కి పైగా విషపూరిత వీడియోలను రికార్డ్ చేసి 11 మంది యువకులకు పంపించాడు. వారిలో 7 మంది కాశ్మీర్‌కు చెందినవారు. వారందరికీ అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంతో సంబంధాలు ఉన్నాయి. మిగిలిన నలుగురు యువకులు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ వాసులు. ఇప్పుడు ఈ 11 మంది యువకులు ఆత్మాహుతి బాంబర్లుగా మారతారనే విషయం దర్యాప్తు సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది. వారి కోసం ఏజెన్సీలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి i20 కారు పేలుడులో 15 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు యావత్ దేశాన్ని కుదిపేశాయి. దేశ రాజధానిలో ఉగ్రవాదులు భారీ కుట్రకు పాల్పడ్డారు. అయితే దాడికి ఒక రోజు ముందు ఫరీదాబాద్ నుండి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఏజెన్సీలు ఉగ్రవాదుల దుర్మార్గపు ప్రణాళికలను భగ్నం చేశాయి.