TVK చీఫ్ విజయ్ ర్యాలీలో మరోసారి అపశ్రుతి..బైక్‌లు ఢీకొని ఏడుగురు కార్యకర్తలకు గాయాలు!

తమిళనాడులోని తూత్తుకుడిలో హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 8 April 2026 4:00 PM IST

National News, Tamilnadu, Thalapathy Vijay, TVK Party, Thoothukudi, RoadAccident, TamilNadu Politics

TVK చీఫ్ విజయ్ ర్యాలీలో మరోసారి అపశ్రుతి..బైక్‌లు ఢీకొని ఏడుగురు కార్యకర్తలకు గాయాలు!

తమిళనాడులోని తూత్తుకుడిలో హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం విజయ్ కాన్వాయ్‌ను అనుసరిస్తూ వెళ్తున్న పార్టీ కార్యకర్తల ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు.

విజయ్ తన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు నెల్లై, తూత్తుకుడి జిల్లాలకు చేరుకున్నారు. తూత్తుకుడి-నెల్లై హైవేపై ఆయన కాన్వాయ్ వెళ్తుండగా, వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు బైక్‌లపై అనుసరించారు. వాగైకుళం సమీపంలో ఒక బైక్ అదుపు తప్పి కింద పడటంతో, వెనుక వస్తున్న మరో ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి.

దీనిపై తూత్తుకుడి రూరల్ డీఎస్పీ సుధీర్ విచారణ చేపట్టారు. గత నెలలో కూడా తంజావూరులో ఇలాగే విజయ్ కాన్వాయ్‌ను అనుసరిస్తూ విఘ్నేష్ అనే యువకుడు ప్రమాదానికి గురై మరణించాడు. అభిమానులు, కార్యకర్తలు ఉత్సాహంతో కాన్వాయ్‌లను వెంబడించడం వరుస ప్రమాదాలకు దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Next Story