ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు

ముంబైలోని గోరేగావ్‌ వెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి.

By అంజి  Published on  6 Oct 2023 8:13 AM IST
fire, Mumbai, Goregaon

ఏడంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు

ముంబైలోని గోరేగావ్‌ వెస్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ప్రమాద స్థలం నుంచి 30 మందికి పైగా సురక్షితంగా బయటపడ్డారు. అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ రోడ్డులోని జే భవానీ భవనంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 06:54 గంటలకు మంటలు ఆర్పివేయబడ్డాయి. గాయపడిన వారిలో 25 మంది హెచ్‌బిటి ఆసుపత్రిలో, 15 మంది కూపర్ ఆసుపత్రిలో చేరారు.

మొత్తం గాయపడిన వారిలో 18 మంది పురుషులు కాగా, వారిలో 22 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మంటలు చెలరేగడంతో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి. భవనంలో అగ్నిమాపక చర్యలు జరుగుతున్నట్లు ఒక వీడియో చూపించింది. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు నివేదికలు తెలిపాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కింగ్ ఏరియాలో పడి ఉన్న గుడ్డకు మంటలు అంటుకోవడంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఇదిలా ఉండగా, అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.

Next Story