ల‌క్నోలో భూ ప్ర‌కంప‌న‌లు.. రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2గా న‌మోదు

5.2 Magnitude Earthquake Hits Lucknow.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2022 3:54 AM GMT
ల‌క్నోలో భూ ప్ర‌కంప‌న‌లు.. రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2గా న‌మోదు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. శ‌నివారం తెల్ల‌వారుజామున 1.12 గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించిన‌ట్లు నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మోల‌జీ(ఎన్‌సీఎస్‌) తెలిపింది. ఈ భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2గా న‌మోదైన‌ట్లు పేర్కొంది. లక్నోకి ఉత్తర-ఈశాన్య దిశగా 139 కి.మీ దూరంలో, భూమి లోపల 82 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్ల‌డించింది.

ల‌క్నోతో పాటు ల‌ఖీంపూర్ ఖేరీ, మ‌రికొన్ని ప్రాంతాల్లో భూ ప్ర‌కంప‌క‌న‌లు సంభ‌వించాయ‌ని భూకంప అధ్య‌య‌న కేంద్రం తెలిపింది. ఢిల్లీలోనూ, నేపాల్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. అర్థ‌రాత్రి భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌లోంచి రోడ్ల‌పైకి ప‌రుగులు తీశారు. కాగా.. ఈ భూకంపం వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉత్తరాఖండ్‌, జమ్మూకశ్మీర్‌లలోనూ భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. ఉత్త‌రాఖండ్‌లోని పితోరాగ్రాఫ్‌లో 3.6 తీవ్ర‌తో, జ‌మ్ముక‌శ్మీర్‌లోని హ‌న్లేలో 3.1 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే.

Next Story