బంగాళాఖాతంలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 5.1గా న‌మోదు

5.1 magnitude quake reported in Bay of Bengal.బంగాళాఖాతంలో భూకంపం సంభ‌వించింది. మంగ‌ళ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 8:52 AM GMT
బంగాళాఖాతంలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 5.1గా న‌మోదు

బంగాళాఖాతంలో భూకంపం సంభ‌వించింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నాం 12.32 గంట‌ల ప్రాంతంలో భూమి కంపించింద‌ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా న‌మోదు అయిన‌ట్లు వెల్ల‌డించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురానికి 260కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కాగా.. దీని ప్ర‌భావం కార‌ణంగా సునామీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చెప్పింది. ఏపీలోని ప‌లు తీర ప్రాంతాల్లో స్వ‌ల్ప భూ ప్ర‌కంప‌న‌లు వచ్చాయి.

అలాగే.. తమిళనాడులోని పలు ప్రాంతంలో భూమి కంపించగా జనాలు భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయని సోషల్ మీడియాలో టీట్లు వెల్లువెత్తాయి. తిరువన్మియూర్, ఆళ్వార్‌పేట్, చెన్నైలోని సుముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ప్రకంపనలు వచ్చాయని వచ్చినట్లు ట్వీట్లలో పేర్కొన్నారు. భూకంపంతోనే ప్రకంపనలు వచ్చినట్లు ఐఎండీ చెన్నై శాఖ ధ్రువీకరించింది. ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పింది. భూకంపం కాకినాడకు ఆగ్నేయంగా 296 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 320 కిలోమీటర్ల భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది.

Next Story