ఆ నెంబర్ ప్లేట్స్‌తో ద‌ర్జాగా తిరుగుతున్నారు.. షాకిచ్చిన పోలీసులు..!

ప్రభుత్వ అధికారులకు చెందిన నెంబర్ ప్లేట్స్ వాడుతున్న 50కి పైగా వాహనాలకు జరిమానాలు విధించారు.

By Medi Samrat  Published on  27 Dec 2024 8:53 PM IST
ఆ నెంబర్ ప్లేట్స్‌తో ద‌ర్జాగా తిరుగుతున్నారు.. షాకిచ్చిన పోలీసులు..!

ప్రభుత్వ అధికారులకు చెందిన నెంబర్ ప్లేట్స్ వాడుతున్న 50కి పైగా వాహనాలకు జరిమానాలు విధించారు. పాట్నాలో తాము కేంద్ర లేదా బీహార్ ప్రభుత్వ అధికారులుగా చెబుతూ అనధికార మెటల్ ప్లేట్‌లను ఉపయోగించినందుకు పోలీసులు ఫైన్ వేశారు. అనధికార మెటల్ ప్లేట్‌లను ఉపయోగిస్తున్న వాహన యజమానుల నుండి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహన యజమానుల నుండి పోలీసులు మొత్తం రూ.28 లక్షల జరిమానాను వసూలు చేశారు.

క్రిస్మస్ సందర్భంగా పాట్నా పోలీసు అధికారులు ప్రారంభించిన డ్రైవ్ లో 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా', 'గవర్నమెంట్ ఆఫ్ బీహార్' అని రాసి ఉన్న అనధికార మెటల్ ప్లేట్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తులపై దృష్టి సారించింది. మెరైన్ డ్రైవ్, బెయిలీ రోడ్, JP గంగా పాత్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ డ్రైవ్ ప్రారంభించారు. ఈ డ్రైవ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు.

Next Story