కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి

తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం నెలకొంది. సోమవారం నాడు ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వైద్య విద్యార్థులు సముద్రంలో మునిగి చనిపోయారు

By Medi Samrat  Published on  6 May 2024 5:30 PM IST
కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి

తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో ఊహించని విషాదం నెలకొంది. సోమవారం నాడు ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వైద్య విద్యార్థులు సముద్రంలో మునిగి చనిపోయారు. విద్యార్థులు ప్రైవేట్ బీచ్‌లో ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూసి ఉన్న లేమూర్ బీచ్‌ లోకి ఓ కొబ్బరితోట నుండి చేరుకున్నారని అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున బీచ్ ని మూసివేశారు.. అయినా కూడా విద్యార్థులు అక్కడికి వెళ్లారు. ఈ ఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నామని కన్యాకుమారి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఇ సుందరవతనం తెలిపారు.

తిరుచిరాపల్లిలోని ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజీకి చెందిన బృందం ఆదివారం నాడు కన్నియాకుమారిలో వివాహానికి వచ్చారు. అందులోని విద్యార్థులు చిన్న సమూహాలుగా విడిపోయారు. ఈ గ్రూప్ ప్రైవేట్ బీచ్‌కి వచ్చింది. మృతులను తంజావూరుకు చెందిన చారుకవి, నైవేలికి చెందిన గాయత్రి, కన్నియాకుమారికి చెందిన సర్వదర్శిత్, దిండిగల్‌కు చెందిన ప్రవీణ్ సామ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. మరో ముగ్గురు కరూర్‌కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి ప్రియాంక, మదురైకి చెందిన శరణ్యను రక్షించారు. వీరు ఆసారిపల్లం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Next Story