ఎన్‌కౌంట‌ర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

5 Maoists Killed In Encounter In Gadchiroli Forest.మావోయిస్టుల‌కు మ‌హారాష్ట్ర‌లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2021 2:47 PM IST
ఎన్‌కౌంట‌ర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల‌కు మ‌హారాష్ట్ర‌లో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మావోయిస్టులు హ‌తం అయ్యారు. శ‌నివారం ఉదయం గ్యార‌ప‌ట్టి అట‌వీ ప్రాంతంలో కూబింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసుల‌పై మావోయిస్టులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. అప్ర‌మ‌త్తమైన పోలీసులు వెంట‌నే ఎదురుకాల్పులు జ‌రిపారు. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృత‌దేహాల‌ను గుర్తించారు. కాల్పులు ఇంకా కొన‌సాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆప్రాంతం మొత్తాన్ని పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు.

Next Story