ఐదారుగురు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు

పార్లమెంట్ ఫలితాల తర్వాత పలు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  8 Jun 2024 11:30 AM IST
ఐదారుగురు ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు

పార్లమెంట్ ఫలితాల తర్వాత పలు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాజకీయ అనిశ్చితిలో భాగమైన మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)కి చెందిన కనీసం ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు శివసేన (యుబిటి) నాయకులతో టచ్‌లో ఉన్నారని, వారు తిరిగి పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే వర్గం చెబుతోంది. శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వాళ్ల రాకపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

మహారాష్ట్రలోని అజిత్ పవార్ ఎన్‌సిపి వర్గానికి చెందిన 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్‌లో ఉన్నారని అంతకుముందు వార్తలు వచ్చాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ పరిణామం జరిగింది. పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ కూడా చెప్పారు. ఆయన ఏ పార్టీ పేరు కూడా చెప్పలేదు. జూన్ 9న జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనల గురించి ఆలోచిస్తామని.. జూన్ 10న మా వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని ఆయన చెప్పారు.

Next Story