ఉత్తరకాశీలో భూకంపం.. వారం వ్య‌వ‌ధిలో మూడో సారి

4.1 Magnitude Earthquake Hits Uttarakhand's Uttarkashi.ఉత్తరాఖండ్‌లో శ‌నివారం ఉద‌యం భూకంపం సంభ‌వించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2022 8:10 AM IST
ఉత్తరకాశీలో భూకంపం.. వారం వ్య‌వ‌ధిలో మూడో సారి

ఉత్తరాఖండ్‌లో శ‌నివారం ఉద‌యం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.1గా న‌మోదు అయిన‌ట్లు నేష‌న‌ల్ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. తూర్పు ఉత్త‌ర‌కాశీకి 39 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు చెప్పింది. శ‌నివారం ఉద‌యం 5.30 గంట‌ల ప్రాంతంలో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల ఇల్లు కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. కాగా.. ఈ భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

కాగా.. వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో భూకంపం రావడం ఇది మూడోసారి. తొలుత ఫిబ్ర‌వ‌రి 5న 3.6 తీవ్ర‌తతో భూమి కంపిచంగా.. ఆ మ‌రుస‌టి రోజు (ఫిబ్ర‌వ‌రి 6న‌) ఉద‌యం 11.27 గంట‌ల‌కు 4.1 తీవ్రంగా భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. కాగా.. ఈనెల 10న జమ్ముకశ్మీర్‌ సహా ఢిల్లీ ఎన్సీఆర్‌, ఉత్తరాఖండ్‌లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపన‌లు చోటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

భూకంపాలు రావడానికి అనేక రకమైన కారణాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమం. భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే, ఆ పొర క్రెస్ట్ లేదా లిథోస్పియర్ అంటారు. దాని కింద పొరను మాంటక్ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. భూప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని 'సిస్మోగ్రాఫ్' అంటారు.

Next Story