40 వెడ్స్ 24.. పోలీసులను ఎందుకు ఆశ్రయించారంటే..

40 year old young man, 24 girl.., used to love each other for 12 years. ప్రేమకు కులం, మతం, వయసు అడ్డురావని అంటుంటారు. ఇలాంటి ఘటనే

By M.S.R  Published on  3 Feb 2022 2:39 PM IST
40 వెడ్స్ 24.. పోలీసులను ఎందుకు ఆశ్రయించారంటే..

ప్రేమకు కులం, మతం, వయసు అడ్డురావని అంటుంటారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలుగుచూసింది. 40 ఏళ్ల వ్యక్తి 24 ఏళ్ల యువతిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రేమ జంట వివాహం చేసుకున్న తర్వాత సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ పెళ్ళిని అమ్మాయి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. వారు తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులతో చెప్పారు.

బరేలీలోని ఫతేగంజ్ వెస్ట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 40 ఏళ్ల జైవరి సింగ్ గత కొన్నేళ్లుగా పొరుగున నివసిస్తున్న 24 ఏళ్ల యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఇద్దరి ఇల్లు ఇరుగుపొరుగున ఉండడంతో ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రేమలో పడ్డప్పుడు తన వయసు 12 ఏళ్లేనని యువతి పోలీసులకు తెలిపింది. చాలా కాలంగా ప్రేమాయణం సాగించిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని జనవరి 25న ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నారు. పెళ్లి తర్వాత ప్రియురాలి కుటుంబ సభ్యులు శత్రువులుగా మారారు. ప్రియురాలు, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వ్రాతపూర్వక ఫిర్యాదు లేఖ ఇవ్వడం ద్వారా, తమ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపింది. తన కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.


Next Story