స్కూళ్లకు రావద్దు.. వెనక్కు పంపించేస్తున్న టీచర్స్

దేశరాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా పబ్లిక్ స్కూల్‌తో సహా 40కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

By అంజి  Published on  9 Dec 2024 9:18 AM IST
schools, Delhi, bomb threat

స్కూళ్లకు రావద్దు.. వెనక్కు పంపించేస్తున్న టీచర్స్ 

దేశరాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌కె పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పశ్చిమ్ విహార్‌లోని జిడి గోయెంకా పబ్లిక్ స్కూల్‌తో సహా 40కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పాఠశాలలకు ఈ-మెయిల్స్ అందాయి. బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఇంటికి పంపించింది. స్కూళ్లకు రావద్దని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అన్ని పాఠశాలల్లో తనిఖీలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదని అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని రెండు, హైదరాబాద్‌లోని ఒక పాఠశాలతో సహా దేశవ్యాప్తంగా అనేక CRPF పాఠశాలలకు ఇ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన ఒక నెల తర్వాత ఈ తాజా సంఘటన జరిగింది. అక్టోబరు 20న, ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పాఠశాల గోడ దగ్గర బలమైన పేలుడు సంభవించింది, అది సమీపంలోని దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ ఘటన కారణంగాఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరిగినట్లు నివేదికలు లేవు.

Next Story