ఓవైసీకి షాకిచ్చిన ఆ న‌లుగురు ఎమ్మెల్యేలు..

4 MLAs from Asaduddin Owaisi’s party join RJD. మ‌జ్లిస్ పార్టీ (ఏఐఎంఐఎం) హైదరాబాద్ లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూడా సత్తా చాటాలని

By Medi Samrat  Published on  29 Jun 2022 2:56 PM GMT
ఓవైసీకి షాకిచ్చిన ఆ న‌లుగురు ఎమ్మెల్యేలు..

మ‌జ్లిస్ పార్టీ (ఏఐఎంఐఎం) హైదరాబాద్ లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో కూడా సత్తా చాటాలని చూస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 2020లో బీహార్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌జ్లిస్ ఏకంగా 5 సీట్ల‌ను గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ ఐదురుగు మ‌జ్లిస్ ఎమ్మెల్యేల్లో న‌లుగురు ఆర్జేడీలో చేరిపోయారు. బుధ‌వారం ఆర్జేడీ కీల‌క‌ నేత‌ తేజ‌స్వీ యాద‌వ్ స‌మ‌క్షంలో ఆర్జేడీలో చేరారు. మ‌జ్లిస్‌ను వ‌దిలి ఆర్జేడీలో చేరిన వారిలో ముహ్మ‌ద్ ఇజార్ అస్ఫీ (కొచ్చాడామ‌మ్‌), ష‌హ‌నాజ్ అలం (జోకిహ‌ర్‌), సయ్య‌ద్ ర‌క్నుద్దీన్ (బైసీ), అజార్ న‌యీమీ (బ‌హ‌దుర్గుని)లు ఉన్నారు. ఆర్జేడీలో ఈ న‌లుగురు చేరిపోవ‌డంతో ఇక మ‌జ్లిస్‌లో అమౌర్ నుంచి విజ‌యం సాధించిన అఖ్త‌రుల్ ఇమాన్ ఒక్క‌రు మాత్ర‌మే మిగిలారు.

AIMIM రాష్ట్ర అధ్యక్షుడు అమౌర్ ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్ మినహా, నలుగురు ఇతర పార్టీ శాసనసభ్యులు RJDలో చేరారు. ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే ఇమాన్ అసదుద్దీన్ ఒవైసీకి విధేయుడిగా కొనసాగుతున్నారు. నలుగురు AIMIM శాసనసభ్యులు చేరడానికి ముందు RJDలో 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు నెలల క్రితం వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో అధికార బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురు ఆర్జేడీలో చేరడంతో ఆర్జేడీ ఎమ్మెల్యేల సంఖ్య 80కి చేరింది.










Next Story