జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్ర దాడి పర్యటకులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటనతో ఆందోళన చెందిన వారంతా వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే 3 వేల 300 మంది టూరిస్టులు శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్రమంత్రి తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఉగ్రదాడి ఎఫెక్ట్‌తో కశ్మీర్ లోయ నుంచి టూరిస్టులు వీడుతుంటే తన హృదయం ద్రవిస్తోందని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో రాసుకొచ్చారు. అయితే, వారు ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నారనేది తాను అర్థం చేసుకోగలనన్నారు. ఉగ్రదాడి అనంతరం 90 శాతం జమ్మూకశ్మీర్ పర్యటన బుకింగ్‌లు రద్దైనట్లు దిల్లీలోని పలు పర్యాటక రవాణా సంస్థలు వెల్లడించాయి. కశ్మీర్‌లోని పర్యటక ప్రదేశాల్లో సెక్యూరిటీ గ్యాప్‌లను భర్తీ చేయాలని సైన్యం, పారామిలిటరీ బలగాలు భావిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో శాశ్వతంగా బలగాలను మోహరించాలని అనుకుంటున్నాయి.