పామును నమిలేసిన మూడేళ్ల బాలుడు.. ఏమైందంటే?

3 సంవత్సరాల బాలుడు పాము పిల్లను నోట్లోకి తీసుకుని నమిలేశాడు. బాలుడు చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. ఆ పాము చనిపోయింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Jun 2023 8:30 AM IST
3 year old boy, snake, Uttar Pradesh, Farrukhabad

పామును నమిలేసిన మూడేళ్ల బాలుడు.. ఏమైందంటే? 

3 సంవత్సరాల బాలుడు పాము పిల్లను నోట్లోకి తీసుకుని నమిలేశాడు. బాలుడు చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. ఆ పాము చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల బాలుడు పాము పిల్లను నమలడం.. ఆ పాము చనిపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. అక్షయ్ అనే బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో పొదల్లోంచి ఓ చిన్న పాము బయటకు వచ్చింది. అతడి ముందు నుండి వెళుతూ కనిపించింది. దీంతో పామును తీసుకుని నోట్లో పెట్టుకుని నమిలాడు. ఆ తర్వాత అరవడం మొదలుపెట్టాడు.

అక్షయ్ నోట్లో పాము ఇరుక్కుపోయి ఉండటాన్ని చూసిన బాలుడి అమ్మమ్మ బిత్తరపోయింది. పిల్లాడి నోటి నుంచి పామును బయటకు తీశారు. భయాందోళనకు గురైన మహిళ, ఆమె కుటుంబ సభ్యులు పిల్లాడిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు బాలుడిని పరీక్షించి, క్షేమంగా ఉన్నట్లు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వైద్యులు పిల్లాడిని ఇంటికి పంపించారు.

Next Story