విషాదం.. హాకీ మ్యాచ్‌లో పిడుగుల వర్షం.. ముగ్గురు ఆటగాళ్ల దుర్మరణం

జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు వర్ధమాన హాకీ క్రీడాకారులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి
Published on : 15 Aug 2024 7:15 AM

Hockey Player, Lightning Strike, Jharkhand

విషాదం.. హాకీ మ్యాచ్‌లో పిడుగుల వర్షం.. ముగ్గురు ఆటగాళ్ల దుర్మరణం

జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం నాడు హాకీ టోర్నమెంట్‌ నిర్వహిస్తుండగా భారీ వర్షం కురిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షంలో తడవకుండా ఉండేందుకు ఆటగాళ్లు సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. ఘటనా స్థలంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.

కొలెబిరా తూటికెట్‌ పంచాయతీ పరిధిలోని ఝప్లా ఆర్‌సి స్కూల్ సమీపంలోని మైదానంలో హాకీ క్రీడాకారులు మ్యాచ్ కోసం సిద్ధమవుతుండగా కొలెబిరా ప్రాంతంలోని టుటికెల్ పంచాయతీ వద్ద ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. బాధితులను ఎనోష్, సేనన్ డాంగ్, నిర్మల్ హోరోగా గుర్తించినట్లు తెలిపారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు అధికారి తెలిపారు. కాగా ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story