700 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.

By Knakam Karthik
Published on : 4 May 2025 2:58 PM IST

National News, Jammukashmir, Ramban District, 3 Army Personnel Killed, Vehicle Skids Off

700 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం, ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ వాహనం అదుపుతప్పి 700 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఆర్మీ వాహనం.. బ్యాటరీ చెష్మా అనే ప్రాంతం సమీపంలో లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రమాద స్థలంలో సైన్యం, పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సేవకులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారని అధికారులు గుర్తించారు. మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్‌గా గుర్తించారు. కాగా లోయలో నుంచి వారి మృతదేహాలను బయటికి తీసేందుకు సహాయ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Next Story