16 ఏళ్ల బాలుడితో 22 ఏళ్ల టీచర్ అదృశ్యం..!
22 Year Old Teacher Falls in Love With Minor Student.తన దగ్గర ట్యూషన్‌కు వస్తున్న ఓ మైనర్ బాలుడికి
By తోట వంశీ కుమార్ Published on 19 Jan 2023 9:33 AM ISTఈ ప్రపంచంలో గురుశిష్యుల బంధం చాలా ఉత్తమమైనదిగా చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం ఈ బంధానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. తన దగ్గర ట్యూషన్‌కు వస్తున్న ఓ మైనర్ బాలుడికి ఓ టీచర్ ప్రేమ పాఠాలు చెప్పింది. అనంతరం ఆ విద్యార్థిని తీసుకుని పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలో జరిగింది.
నోయిడాలోని సెక్టార్ 123కి చెందిన 22 ఏళ్ల యువతి తన ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ చెబుతుండేది. ఆ టీచర్ ఇంటి పరిసరాల్లోనే 16 ఏళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా ఆ బాలుడు ఆ యువతి చెప్పే టూషన్‌కు వెలుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో అత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బాలుడు బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతడి తండ్రి చుట్టు పక్కలా అంతా వెతికాడు. ఎక్కడా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. బాలుడికి ట్యూషన్ చెప్పే టీచర్ కూడా కనిపించకపోవడంతో ఆమె తన కొడుకుని ప్రలోభ పెట్టి తీసుకుపోయి ఉంటుందని బాలుడి తండ్రి అనుమానిస్తున్నాడు.
వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి టీచర్‌పై ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.