ప్రయాగ్‌రాజ్‌లో అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపు.. 22 మంది అరెస్టు

ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారిక అనుమతి లేకుండా ప్రయాగ్‌రాజ్‌లో మొహర్రం ఊరేగింపు నిర్వహించినందుకు 22 మందిని అరెస్టు చేశారు.

By అంజి
Published on : 6 July 2025 8:20 AM IST

arrest, Prayagraj, Muharram procession, uttarpradesh

ప్రయాగ్‌రాజ్‌లో అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపు.. 22 మంది అరెస్టు

ఉత్తరప్రదేశ్ పోలీసులు అధికారిక అనుమతి లేకుండా ప్రయాగ్‌రాజ్‌లో మొహర్రం ఊరేగింపు నిర్వహించినందుకు 22 మందిని అరెస్టు చేశారు. 40 మందిపై కేసు నమోదు చేశారు, వీరిలో 18 మంది పరారీలో ఉన్నారు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్‌లోని యమునానగర్ జోన్‌లోని సిర్సా మార్కెట్ ప్రాంతంలో ఊరేగింపు జరిగింది. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

అనుమతి లేకుండా ఈ ఊరేగింపును బయటకు తీసుకెళ్లడంతో స్థానిక వ్యాపారుల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ట్రేడ్‌ లీడర్‌ భగవాన్ కేసరి నేతృత్వంలోని దుకాణదారుల బృందం తాల్ చౌరాహా వద్ద గుమిగూడి ఈ అనధికార కార్యక్రమానికి అభ్యంతరం వ్యక్తం చేసింది, దీనితో రెండు గ్రూపుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసు బృందాలు త్వరగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అనేక మంది వ్యాపారులు దాఖలు చేసిన సమిష్టి ఫిర్యాదు మేరకు, అధికారులు 40 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేశారు. మరో 18 మంది నిందితులను కనుగొని అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story