మరిన్ని ఎల్పీజీ నౌకలు వచ్చేస్తున్నాయ్..!

హార్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా దాటుతున్నాయి.

By -  Medi Samrat
Published on : 14 March 2026 9:20 PM IST

మరిన్ని ఎల్పీజీ నౌకలు వచ్చేస్తున్నాయ్..!

హార్ముజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా దాటుతున్నాయి. భారత ఎల్పీజీ నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని ఇరాన్ హామీ ఇవ్వడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల ఫలితంగా రవాణాకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ రంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 'శివాలిక్', 'నందా దేవి' అనే రెండు చమురు ట్యాంకర్లు ఇప్పటికే భారత్‌కు బయల్దేరాయి. మరో రెండు రోజుల్లో ఇవి ముంబై లేదా కాండ్లా పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. 'శివాలిక్' నౌకకు భారత నౌకాదళం భద్రత కల్పిస్తోంది. 'నందా దేవి' నౌక 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ మార్చి 12 నాటి సమాచారం ప్రకారం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మొత్తం 28 భారత నౌకలు ఉన్నాయి. వీటిలో 778 మంది భారత సిబ్బంది ఉన్నారు. ఈ నౌకల్లో సుమారు 2.15 లక్షల టన్నుల ఎల్ఎన్‌జీ, 4.15 లక్షల టన్నుల ఎల్పీజీ, 17.5 లక్షల టన్నుల ముడి చమురు ఉంది.

Next Story