బెంగళూరులో ఘోరం..విద్యార్థినికి మత్తు టాబ్లెట్ ఇచ్చి ప్రియుడు, స్నేహితుడు గ్యాంగ్ రేప్
బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. 19 ఏళ్ల ప్రైవేట్ కళాశాల విద్యార్థినిపై ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు
By - Knakam Karthik |
బెంగళూరులో ఘోరం..విద్యార్థినికి మత్తు టాబ్లెట్ ఇచ్చి ప్రియుడు, స్నేహితుడు గ్యాంగ్ రేప్
బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. 19 ఏళ్ల ప్రైవేట్ కళాశాల విద్యార్థినిపై ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జుక్కూరు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో, బాధితురాలికి మత్తు కలిగించే 'పింక్ టాబ్లెట్' ఇచ్చి ఆమె స్పృహలో లేని సమయంలో డిక్సిన్, నిఖిల్ అనే నిందితులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని వారు బెదిరించడంతో తొలుత భయపడిన యువతి, ఆ తర్వాత ధైర్యం చేసి కుటుంబ సభ్యులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదుతో అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగళూరు పోలీసులు నిందితుల కోసం గాలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఘటన నేపథ్యం:
తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల బీఏ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డిక్సన్ సాండో (21) అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. ఫిబ్రవరి 14 రాత్రి బెంగళూరులోని ఒక ప్రైవేట్ విల్లాలో జరిగిన పార్టీకి డిక్సన్ ఆమెను ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు నిఖిల్ (35) అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు. పార్టీలో వీరిద్దరూ కలిసి ఆమెకు బలవంతంగా ఒక 'పింక్ కలర్' మత్తు బిళ్ల ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయాక గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. బయటకు చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఆమె పేర్కొంది.
ట్విస్ట్ ఇచ్చిన నిందితులు:
బాధితురాలు పోలీసులను ఆశ్రయించడానికి ఒకరోజు ముందే నిందితులు ఆమెపై ఎదురు ఫిర్యాదు చేశారు. సదరు యువతి ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధిని వెంటబెట్టుకుని వచ్చి, తమను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేసిందని వారు ఆరోపించారు. ప్రస్తుతం అమృతహళ్లి పోలీసులు ఈ ఘటనపై సామూహిక అత్యాచారం మరియు క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. అయితే, ఒకవైపు రేప్ ఆరోపణలు, మరోవైపు నిందితులు చేస్తున్న బ్లాక్ మెయిల్ ఆరోపణల మధ్య అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
A 19-year-old private college student in Bengaluru was allegedly drugged and gang-raped by her boyfriend and his friend. The incident occurred in Jukkur, where the victim was laced with a pink tablet and sexually assaulted while unconscious. The accused, Dixin and Nikhil,…
— ANI (@ANI) February 23, 2026