శ్మశానవాటిక పైకప్పు కూలి 18 మంది దుర్మరణం

18 killed in Muradnagar. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ జిల్లా మురద్‌నగర్‌లో శ్మశానవాటిక పైకప్పు కూలి 18 మంది దుర్మరణం.

By Medi Samrat  Published on  3 Jan 2021 12:29 PM GMT
roof collapse incident in Muradnagar

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ జిల్లా మురద్‌నగర్‌లో ఓ శ్మశాన వాటిక ఘాట్‌ భవన సముదాయం పైకప్పు కుప్పకూలి 18 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా భవనం పిల్లర్‌ ఒక్కసారిగా కూలడంతో పైకప్పు కుప్పకూలి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.ఘటనాస్థలానికి చేరుకున్న‌ ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించి.. సమీప దవాఖానలకు తరలించారు. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భాంతి వ్యక్తం చేశారు. శిథిలాల కింద చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఘజియాబాద్‌ జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీని ఆదేశించారు.మృతుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో శ్మశానవాటిక కాంప్లెక్స్‌ కింద 40 మందిపైగా ఉన్నట్లు సమాచారం.


Next Story
Share it