మూడు బైక్ లపై ఏకంగా 14 మంది.. ఎందుకోసమో తెలుసా..?

14 men perform dangerous stunt on 3 bikes in UP, land in trouble. బరేలీ-నైనిటాల్ హైవే పై మూడు బైక్‌లపై ఏకంగా 14 మంది వ్యక్తులు ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు.

By M.S.R  Published on  11 Jan 2023 7:45 PM IST
మూడు బైక్ లపై ఏకంగా 14 మంది.. ఎందుకోసమో తెలుసా..?

బరేలీ-నైనిటాల్ హైవే పై మూడు బైక్‌లపై ఏకంగా 14 మంది వ్యక్తులు ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. వీడియో వైరల్‌గా మారింది.. ఏకంగా పోలీసుల దృష్టికి వెళ్ళింది. సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఈ వీడియో షూట్ చేస్తున్నారని.. ఆరుగురు వ్యక్తులు ఒకే బైక్‌పై వెళుతున్నట్లు కనిపించారు. ఈ వీడియోను ఆదివారం చిత్రీకరించినట్లు సమాచారం. పోలీసులు వారిపై చర్యలు తీసుకునే లోపే అక్కడి నుండి పారిపోయారు. కానీ పోలీసులు అక్కడితో విడిచిపెట్టలేదు. స్టంట్‌లో పాల్గొన్న వారిపై పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. అన్ని బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటున్నామని బరేలీ ఎస్‌ఎస్పీ అఖిలేష్ కుమార్ చౌరాసియా తెలిపారు.

మొత్తం 14 మంది పురుషులు.. ఒక బైక్‌పై ఏకంగా ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారు హెల్మెట్‌లను కూడా ఉపయోగించలేదు. మగవాళ్లు బైక్‌లపై నిలబడి ఫొటోలు దిగడం కనిపించింది. "సమాచారం అందుకున్న వెంటనే బైక్‌లను స్వాధీనం చేసుకున్నాము. చర్యలు తీసుకుంటున్నాము" అని పోలీసులు తెలిపారు.


Next Story