కర్ణాటకలోని మంగళూరులో సోమవారం రాత్రి ఫుడ్ పాయిజన్ కారణంగా 137 మంది నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు.
పోలీసు వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులు మంగళూరులోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు.
కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థులను విద్యార్థులను మంగళూరులోని పలు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నీరు కలుషితం కావడమే ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమని బావిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. చికిత్స పొందుతున్న పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.