ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం రేపింది. ఇటలీ నుండి అమృత్‌సర్ వచ్చిన ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన వారికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. సుమారు 125 మంది ప్రయాణికులు అమృత్‌సర్ విమానాశ్రయానికి చేరుకోగానే.. వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో విమాన ప్రయాణికుల్లో 125 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వీకే సేథ్ తెలిపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.
దేశంలో ఓమిక్రాన్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కోవిడ్-19 కేసుల సంఖ్య విస్తరిస్తోంది. భారతదేశంలో ఇవాళ 90,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గురువారం నాడు 495 ఓమిక్రాన్ వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి పెరిగింది. మొత్తం కేసులలో, మహారాష్ట్రలో గరిష్టంగా 797 ఉన్నాయి. దేశంలో 90,928 తాజా కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌లు నమోదయ్యాయి. ఇది 200 రోజులలో అత్యధికం. ఇక వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.