ఘోరం.. విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి

11 killed as heavy rains cause landslide in Mumbai's Chembur.ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. కుండ‌పోత‌గా వ‌ర్షాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 July 2021 8:39 AM IST
ఘోరం.. విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి

ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. కుండ‌పోత‌గా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో కొండచ‌రియ‌లు విరిగిప‌డి 11 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. శ‌నివారం నుంచి మ‌హారాష్ట్ర‌లో కుండ‌పోత‌గా వ‌ర్షాలు కురుస్తున్నాయి. చెంబూరులోని భరత్‌నగర్‌ ప్రాంతంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా కొండచరియలు విరిగి గోడ మీద ప‌డ్డాయి. ఆ ధాటికి గోడ కూడ కుప్ప‌కూలింది. ఆ గోడ కింద నివ‌సిస్తున్న జ‌నాల‌పై గోడ‌తో పాటు కొండ‌చ‌రియ‌లు ప‌డ‌డంతో భారీగా ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నాయి. 11 మృత‌దేహాల‌ను వెలికి తీయ‌గా.. శిథిలాల నుంచి 13 మందిని ర‌క్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను రాజవాడి, సమీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఇక భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబైలోని లోత‌ట్టు ప్రాంతాలైన చున‌భ‌ట్టి, దాదార్‌, గాంధీ మార్కెట్‌, చెంబూరు, కుర్ల ఎల్బీఎస్ రోడ్ల పై భారీగా వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తున్నాయి. వ‌ర‌ద నీటి దాటికి ప‌లు కార్లు కొట్టుకుపోయాయి. విఖ్రోలి సూర్యానగర్ ప్రాంతంలో నాలుగు ఇండ్లు కూలిపోయాయి.

Next Story