ఉక్రెయిన్‌ నుండి స్వదేశానికి.. 100 మంది గుజరాత్‌ విద్యార్థులు

100 Gujarat students return home from Ukraine. దాదాపు వంద మంది గుజరాత్ విద్యార్థులు యుద్ధ పీడిత ఉక్రెయిన్ నుండి ముంబైకి ప్రత్యేక విమానంలో వచ్చిన

By అంజి  Published on  28 Feb 2022 2:39 PM IST
ఉక్రెయిన్‌ నుండి స్వదేశానికి.. 100 మంది గుజరాత్‌ విద్యార్థులు

దాదాపు వంద మంది గుజరాత్ విద్యార్థులు యుద్ధ పీడిత ఉక్రెయిన్ నుండి ముంబైకి ప్రత్యేక విమానంలో వచ్చిన తర్వాత.. గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎస్‌ఆర్టీసీ బస్సుల ద్వారా ఇంటికి తిరిగి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో మొత్తం 44 మంది గుజరాత్ విద్యార్థులు శనివారం ముంబైకి క్షేమంగా తిరిగి వచ్చారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (జీఎస్‌ఆర్‌టీసీ) వోల్వో బస్సుల ద్వారా విద్యార్థులను గుజరాత్‌కు తీసుకొచ్చారు. మరో ప్రత్యేక విమానంలో గుజరాత్ విద్యార్థులు ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గుజరాత్‌కు తిరుగు ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 584 మంది రాష్ట్రానికి చెందిన వ్యక్తుల సమాచారం గుజరాత్ ప్రభుత్వం వద్ద ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జితుభాయ్ వాఘాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 079-232-38278 హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రారంభించింది. ఇది ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య పని చేస్తుంది. సోమవారం గాంధీనగర్ సర్క్యూట్ హౌస్‌లో ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన ఇరవై ఏడు మంది విద్యార్థులకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. విద్యార్థులను గుజరాత్‌కు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ట్వీట్‌లో పేర్కొంది.

Next Story