చిందిన రైతు రక్తం.. క్రూరత్వం ప్రదర్శించిన పోలీసులు

10 Haryana farmers injured in police 'lathicharge' in Karnal. హర్యానాలో పోలీసుల పని తీరు.. రైతుల రక్తం చిందించింది. రైతులపై పోలీసులు

By అంజి  Published on  29 Aug 2021 3:36 AM GMT
చిందిన రైతు రక్తం.. క్రూరత్వం ప్రదర్శించిన పోలీసులు

హర్యానాలో పోలీసుల పని తీరు.. రైతుల రక్తం చిందించింది. రైతులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ అక్కడి రైతులు నిరసన తెలిపారు. దీంతో అక్కడి రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసుల దాడుల్లో సుమారు 10 మంది రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెళ్లి కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలపై నిరసన తెలపాలని భారతీయ కిసాన్ యూనియన్ రైతులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే రైతులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నియంత్రణ కోల్పోయిన పోలీసులు.. రైతులను విచక్షణారహితంగ కొట్టారు. కర్నాల్ జిల్లా ఉన్నతాధికారి రైతులు బ్యారికేడ్లు దాటితే వారి తలలు పగులగొట్టండి అంటూ పోలీసులకు ఆదేశాలకు ఇస్తున్న వీడియో వైరల్‌గా అయింది.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని నిరసన తెలిపిన రైతులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ పోలీసులు ఆందోళనకు దిగారని, తమపై రాళ్లు రువ్వారని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు లాఠీచార్జ్‌కు దిగామని పోలీసులు చెప్పుకొచ్చారు. హర్యానాలో రైతులపై జరిగిన లాఠీచార్జ్‌ని జాతీయ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రక్తం కారుతున్న రైతు ఫొటోను ఒకటి రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ రైతుల రక్తంతో... దేశం సిగ్గుతో తలదించుకుందన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా స్పందించారు. పోలీసుల తీరును తప్పుబట్టిన ఆయన..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాన్నారు. కర్నాల్ ఘటనతో హర్యానావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.


Next Story
Share it