నాసా 'స్టార్‌లైనర్' స్పేస్‌క్రాప్ట్ ప్రయోగం విఫలం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Dec 2019 12:05 PM ISTఅమెరికా తన దేశం యొక్క వ్యోమగాములను స్పేస్‌క్రాప్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించడానికి ఇప్పటి వరకు రష్యా టెక్నాలజీని వాడుకుంది. స్పేస్‌క్రాప్ట్ టెక్నాలజీ తన వద్ద లేకపోవడంతో అమెరికా రష్యా సాయం తీసుకొని వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది. వ్యోమగాముల అంతరిక్షంలో ప్రత్యేక ప్రయాణించే వాహనాన్నే స్పేస్‌క్రాఫ్ట్ అంటారు. అయితే రష్యా సాయం లేకుండా సొంతంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడం కోసం ఆ టెక్నాలజనీ అభివృద్ధి చేయడానికి నాసా బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇందుకు గాను బోయింగ్ సంస్థకు 4.2 బిలియన్ డాలర్స్ (దాదాపు 3 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కి 2.6 బిలియన్ డాలర్స్(1800 కోట్లు) నిధులు కేటాయించింది.
డిసెంబర్ 20న బోయింగ్ యెక్క సీఎస్‌టీ-100 స్టార్‌లైనర్ వ్యోమగామి స్పేస్‌క్రాప్ట్‌ని ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. అయితే ఇది కేవలం టెస్టు కోసమే లాంచ్ చేశామని, అందులో వ్యోమగాములను ఎవరిని పంపించలేదని నాసా పేర్కొంది. కాగా ఈ స్పేస్‌క్రాప్ట్ నిర్దిష్ట కక్ష్యలోకి చేరిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌తో కలవాలి. కానీ చివరి క్షణాల్లో సాంకేతిక లోపం కారణంగా స్పేస్ సెంటర్‌తో కలవకపోవడం ప్రయోగం విఫలమయింది.
స్టార్‌లైనర్ స్పేస్‌క్రాప్ట్ ప్రయోగం విఫలంపై నాసా చీఫ్ మాట్లాడారు. ఈ సమస్యకు ప్రధాన కారణం స్టార్‌లైనర్‌లోని అంతర్గత గడియారమేనని, ఇది స్పేస్‌క్రాప్ట్ వాహనం వాస్తవాని కంటే వేరే సమయాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. దీంతో స్టార్‌లైనర్ ఉద్దేశించిన కక్ష్యలో చేరడానికి చేయ్యాల్సిన అన్ని విన్యాసాలను నిలిపివేసిందన్నారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టార్‌లైన్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌తో కలవడానికి అవకాశం లేదని తెలిపారు.