విద్యుత్‌ విమానం వచ్చిసిందోచ్‌..!

By అంజి  Published on  21 Dec 2019 8:39 AM GMT
విద్యుత్‌ విమానం వచ్చిసిందోచ్‌..!

ప్రపంచంలోనే మొట్ట మొదటి సారిగా విద్యుత్‌తో నడిచే విమానం గాలిలోకి ఎగిరింది. విద్యుదీకరణ అనేది నేడు రవాణాకు భవిష్యత్తుగా మారిపోయింది. ప్రపంచం టెక్నాలజీతో పరుగులు పెడుతూ.. ప్రతి రోజూ ఆవాస్తవికతకు ఒక అడుగు దగ్గరగా వస్తోంది. మనం విద్యుత్‌తో నడిచే కార్లు, బస్సులు చూశాము.. కానీ మొట్టమొదటి సారిగా విద్యుత్‌తో నడిచే విమానాన్ని ఇటీవలే విజయవంతంగా పరీక్షించారు. అవును మీరు విన్నది నిజమే ఈ విమానం ఆస్ట్రేలియాకి చెందిన హార్బర్‌ ఎయిర్‌, మాగ్నిక్స్‌ అనే రెండు కంపెనీలు కలిసి తయారు చేశాయి. ఈ విమానానికి 'ఇబీవర్' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ విమానంలో ఆరుగురు ప్రయాణికులు కూర్చునే విధంగా రూపొందించారు.

ఈ విమానం ఇంజన్‌ పవర్‌ 750 హార్స్‌ పవర్‌తో సమానంగా ఉంది, మాగ్ని 500 ప్రొపల్షన్‌ సిస్టమ్‌ కలదు. ఇది విమానానికి సమర్థవంతమైన శక్తిని అందించడానికి సహాయపడుతుంది. ఇబీవర్‌ విమానం గరిష్ట వేగం, ఇతర వివరాలను ఆ కంపెనీ వర్గాలు వెల్లడించలేదు. ఇబీవర్‌ విమాన ప్రయోగం కెనడాలోని వాంకోవర్‌ పట్టణంలోని ఫ్రేసర్‌ అనే నది తీరాన జరగింది. ప్రయోగంలో భాగంగా విమానం 10 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఈ విమానాన్ని హార్బర్‌ ఎయిర్‌ సీఈవో, ఫౌండర్‌ గ్రెగ్‌ మెక్‌డౌగల్‌ నడిపారు. విమానం పూర్తిగా లిథియం బ్యాటరీతో విడుదలయ్యే విద్యుత్‌తో పని చేయడం వల్ల గరిష్టంగా 160 కి.మీ ప్రయాణించగలదని తయారీదారులు పేర్కొన్నారు. ఇది పూర్తిగా విద్యుత్‌ ద్వారా ప్రయాణిస్తుంది కావున ఇతర విమానాల లాగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల చేయదు. కాలుష్య నివారణకు భవిష్యత్తులో విద్యుత్‌ విమానాలు దోహదపడనున్నాయి. 2022 నాటికి తమ వద్ద ఉన్న విమానాల్ని ఎక్కువ మొత్తంలో విద్యుద్దీకరించాలని ఆ కంపెనీ భావిస్తోంది.

Next Story