రెండేళ్లలో డేటా చోరీ నిరోధక వ్యయంలో 8 శాతం పెరుగుదల..

By Newsmeter.Network  Published on  14 Dec 2019 7:41 AM GMT
రెండేళ్లలో డేటా చోరీ నిరోధక వ్యయంలో 8 శాతం పెరుగుదల..

మన దేశంలో కంప్యూటర్ డేటా చౌర్యం, హ్యాకింగ్ లు నానాటికీ పెరుగుతున్నాయని, కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో డేటా చౌర్యం, హ్యాకింగ్ చేసే అవకాశాలు మరింత పెరిగాయని, గత రెండేళ్లలోనే డేటా చౌర్య నిరోధానికయ్యే వ్యయం లో 8 శాతం పెరుగుదల కనిపించిందని పీ డబ్ల్యుసి, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ లు సంయుక్తంగా నిర్వహించిన ఒక అద్యయనం వెల్లడించింది. వ్యక్తులు, సంస్థల మధ్య కనెక్టివిటీ పెరుగుతున్న కొద్దీ చాలా డేటా ఇంటర్నెట్ ఆరు బయట్లో అందుబాటులోకి వచ్చేస్తోందని, దీని వల్ల డేటా చౌర్యం పెరుగుతోందని ఈ అధ్యయనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

సైబర్ దాడుల పెరుగుదల తో పాటు మాలవేర్ ఇన్ సైడర్ ఎటాక్ లు జరిగే అవకాశాలు కూడా గతేడాదితో పోలిస్తే పదిహేను శాతం పెరిగాయి. టెక్నాలజీ పెరుగుదల తో పాటు అడ్వాన్స్ డ్ పెరిస్టెట్ త్రెట్, జీరో డే, మాలవేర్, మల్టి వెక్టర్ దాడులు బాగా పెరిగాయని, ఏటీఎం స్విచ్చ్ లు, పర్మెనెంట్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ల పై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని పీ డబ్ల్యు సి సైబర్ సెక్యూరిటీ లీడర్ సిద్ధార్థ్ విశ్వనాద్ చెబుతున్నారు.

మన దేశంలో సైబర్ సెక్యూరిటీ మార్కెట్ 2019 లో 2 బిలియన్ డాలర్లు ఉండగా 2022 నాటికి ఇది మూడు బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని , ఇది ప్రపంచవ్యాప్త పెరుగుదల కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ అని అధ్యయనం చెబుతోంది, బ్యాంకింగ్ ఆర్ధిక సేవల పరిశ్రమ, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ మార్కెట్ ప్రధానంగా నిర్దేశితమౌతుందని అధ్యయనం తెలియచేస్తోంది.

సైబర్ సెక్యూరిటీ వ్యయంలో 26 శాతం బ్యాంకింగ్, ఆర్ధిక సేవల పరిశ్రమ ల వల్లే జరుగుతోందని, ఈ వ్యయం ప్రస్తుతం 518 మిలియన్ డాలర్ల నుంచి 2022 నాటికి 810 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. చెల్లింపులలో కృత్రిమ మేథస్సు, బ్లాక్ చైన్, ఐ ఓ టీ, పో ఓ ఎస్ ల ను ఉపయోగించడం వల్ల ప్రమాదావకాశాలు పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు కూడా 2019 లోని 65 బిలియన్ల డాలర్ల నుంచి 2023 నాటికి 135 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయి. హ్యాకర్లు ఎక్కువగా కార్పొరేట్ బ్యాంకింగ్ వ్యవస్థలపైనే దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ నిరోధక వ్యయం మరింత పెరిగే సూచనలు కానవస్తున్నాయి.

Next Story