అమెజాన్ ప్రైమ్ లో నాని, సుధీర్ బాబు 'వి' సినిమా.. రిలీజ్ డేట్, టైమ్ ఎప్పుడంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 8:51 AM GMT
అమెజాన్ ప్రైమ్ లో నాని, సుధీర్ బాబు వి సినిమా.. రిలీజ్ డేట్, టైమ్ ఎప్పుడంటే..?

నాని 25వ సినిమా 'వి' ని థియేటర్లలో ఎంజాయ్ చేద్దామని అనుకున్న అభిమానులందరికీ బ్యాడ్ న్యూస్. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ 'వెంకటేశ్వర క్రియేషన్స్' అఫీషియల్ గా ధృవీకరించింది.

ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ చేయనున్నారు. నానితో పాటు ఇందులో సుధీర్ బాబు కీలక పాత్ర పోషించాడు. అదితీరావు హైదరి, నివేద థామస్ హీరోయిన్లుగా నటించారు.

అధికారిక ప్రకటనకు ఒకరోజు ముందే నాని ఈ సినిమాను హోమ్ లో చూసేయండి అంటూ వీడియోను అప్లోడ్ చేశాడు. ''సినిమా అయిపోతేనేమి.. మళ్ళీ చూస్తా.. మళ్ళీ మళ్ళీ చూస్తా.. నాకు ఇష్టమొచ్చినన్ని సార్లు చూస్తా.. థియేటర్ ఇంటికి వచ్చినా రాకపోయినా థియేటర్ ఎక్స్ పీరియన్స్ మాత్రం ఇంటికి రాబోతోంది. మన ఇళ్లే థియేటర్ గా మారబోతోంది'' అంటూ నాని ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేసాడు. నాని కెరీర్ లో 25వ సినిమాగా వస్తున్న సినిమా 'వి'. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తున్నాడు. మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది వీలు పడలేదు.Next Story