స్నానం చేస్తుంటే బ్యాగు ఎత్తుకెళ్లిన పంది.. అడవి అంతా నగ్నంగా.. వీడియో వైరల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 12:10 PM IST
స్నానం చేస్తుంటే బ్యాగు ఎత్తుకెళ్లిన పంది.. అడవి అంతా నగ్నంగా.. వీడియో వైరల్

ఒక్కో సారి కొందరు చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి. తొందరలో.. తాము ఏ స్థితిలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా వారు చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి. ఓ పెద్దాయన సరస్సులో స్నానం చేస్తున్నాడు. అతడి వస్తువులను అన్నింటిని బ్యాగులో ఉంచి బ్యాగును సరస్సు ఒడ్డున పెట్టాడు. అంతలో ఓ పంది ఆ బ్యాగును నోటితో కరుచుకుని పరిగెత్తింది. దీన్ని గమనించిన ఆ పెద్దాయన ల్యాప్‌ టాప్‌ పోతుందన్న తొందరలో కనీసం ఒంటిపై బట్టలు ఉన్నాయా లేవా అన్నవి చూసుకోకుండా సరస్సు నుంచి బయటకు వచ్చాడు. పంది వెంట పరిగెత్తాడు. పాపం ఆ పంది అతడిని అడవి అంతా తిప్పించింది. చుట్టూ ఉన్న వాళ్లు అతడిని చూసి నవ్వుకున్నారు. ఈ ఘటన జర్మనీలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. బెర్లిన్‌లోని గ్రున్‌ వాల్డ్‌ అడవిలో ట్యూఫెల్సి సరస్సు ఉన్నది. సేద తీరేందుకు అక్కడికి ఓ పెద్దాయన వచ్చాడు. సరస్సును చూసే సరికి ఈత కొట్టాలనే కోరిక కలిగింది. వెంటనే బట్టలను, తన వెంట తెచ్చుకున్న ల్యాప్‌టాప్‌ను ఓ బ్యాగులో పెట్టి సరస్సు ఒడ్డున పెట్టాడు. అనంతరం స్నానం చేయడానికి సరస్సులోకి దిగాడు. కొంత సమయం గడిచాక.. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కానీ.. ఓ పందుల గుంపు అక్కడికి వచ్చింది. అందులో ఓ పంది అతడి బ్యాగును నోటితో పట్టుకుని పరిగెత్తింది.

దీన్ని గమనించిన ఆ పెద్దాయన.. ల్యాప్‌టాప్‌ పోతుందన్న తొందరలో కనీసం ఒంటిపై బట్టలు ఉన్నాయా లేవా అన్నవి చూసుకోకుండా సరస్సు నుంచి బయటకు వచ్చాడు. పంది వెంట పరిగెత్తాడు. పాపం ఆ పంది అతడిని అడవి అంతా తిప్పించింది. చుట్టూ ఉన్న వాళ్లు అతడిని చూసి నవ్వుకున్నారు. ఈ దృశ్యాలను అడిలె అనే మహిళ వీడియో తీసింది. అనంతరం వాటిని అతడికి చూపించగా.. అతడు వాటిని చూసి నవ్వుకున్నాడు. సదరు మహిళ అతడి పర్మిషన్‌ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇంకేముంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్లు ఊరుకుంటారా.. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. జర్మనీలో నదులు, చెరువుల్లో నగ్నంగా సన్‌బాత్‌, స్మిత్‌ చేయడం సర్వసాదారణం.

Next Story