హిందూత్వం గురించి మనసులో మాట చెప్పిన మెగా బ్రదర్

By రాణి  Published on  26 July 2020 6:47 AM GMT
హిందూత్వం గురించి మనసులో మాట చెప్పిన మెగా బ్రదర్

మెగా బ్రదర్ నాగబాబు.. ఎప్పుడు ఏ విషయం గురించి ఎక్కడ ఎలా స్పందిస్తారో ఎవరికీ అర్థం కాదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా మొదలు నుంచి ఇప్పటి వరకూ రకరకాల విషయాలపై ఇటు ట్విట్టర్ లో అటు యూ ట్యూబ్ లో స్పందించిన ఘనత నాగబాబుకే చెందింది. గాంధీ - గాడ్సేల గురించి, బాలయ్య శివశంకరి గాత్రం గురించి చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. తాజాగా హిందూత్వం టాపిక్ ఎందుకొచ్చిందో తెలీదు గానీ..ఆయన మాత్రం తాను నాస్తికుడిని అంటూనే భగవంతుడిని నమ్ముతాను అన్నట్లు ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

'' నేనొక నాస్తికుడిని. కానీ కొన్ని మత సిద్ధాంతాల పట్ల నా ఒపీనియన్ చెప్పాలి.I respect Hinduism.కారణం ఏంటంటే ఈశ్వరుడు ఒక్కడే అని నమ్మినా,అనేక దేవతలున్నారని నమ్మినా, విగ్రహారాధనని నమ్మినా,ఇతర మతాలని నమ్మినా,అసలు దేవుడే లేడనే నాస్తికులుని ఎవరినీ నిందించని మతం హిందూమతం. మనిషిని మనిషిగా మంచిగా బ్రతకమని చెప్తుంది హిందుమతం. ఇతర మతాలతో సఖ్యంగా ఉండమని చెప్తుంది హైన్దవం. నీ మతం కానీ వాడిని చంపెయ్యి, విగ్రహారాధన చేసే వాళ్ళు నరకానికి పోతారు,మా దేవుడు నిజమైన దేవుడు మీ దేవుడు చెడ్డవాడు లాంటి పిచ్చి మాటలు చెప్పని hinduism అంటే నాకు గౌరవం. But i am an atheist..'' అని నాగబాబు వరుస ట్వీట్లు చేశారు.

ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు.. మొదలే నేను నాస్తికుడిని అని పెట్టి.. మళ్లీ హిందూత్వం గొప్ప అని చెప్తున్నారు కానీ.. తాము మాత్రం నాగబాబు నాస్తికుడని అనుకోవట్లేదని కామెంట్లు చేస్తున్నారు. ఎవరి మతం వారికి గొప్ప అని మరికొంతమంది అంటే..అసలు దేవుడే లేడు అనేవాడు కదా నాస్తికుడంటే అని ఇంకొంతమంది అంటున్నారు.

Next Story