కైలాష్ సత్యార్థి.. 26 ఏళ్లకే ఉద్యోగం మానేసి.. బాల కార్మికులకు వ్యతిరేకంగా గళం..
Satyarthi, who freed more than 83,000 children. బాల కార్మికులకు వ్యతిరేకంగా గళం విప్పిన కైలాష్ సత్యార్థి, ఎంతో మంది బాల కార్మికుల
By Medi Samrat Published on 11 Jan 2022 9:06 AM ISTబాల కార్మికులకు వ్యతిరేకంగా గళం విప్పిన కైలాష్ సత్యార్థి, ఎంతో మంది బాల కార్మికుల గొంతుకగా మారారు. ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు వేల మంది బాలకార్మికులకు బండ చాకిరి నుండి విముక్తి కల్పిస్తూ కైలాష్ వారికి విద్యనందిస్తున్నారు. ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. బాల కార్మికులకు వ్యతిరేకంగా రెండున్నర దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేసిన కైలాష్ సత్యార్థి.. 1954 జనవరి 11న మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో జన్మించారు. ఆయన తన భార్య, కొడుకు, కోడలు, కుమార్తెతో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆయన 'బచ్‌పన్ బచావో ఆందోళన' కూడా నిర్వహిస్తున్నారు. కైలాష్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే.. 26 ఏళ్లకే ఉద్యోగం మానేసి బాలల హక్కుల కోసం కృషి చేయడం ప్రారంభించారు. కైలాష్ ప్రస్తుతం 'గ్లోబల్ మార్చ్ ఎగైనెస్ట్ చైల్డ్ లేబర్' అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
83,000 మందికి పైగా పిల్లలకు విముక్తి :
83,000 మందికి పైగా పిల్లలకు వెట్టి చాకిరి నుండి విముక్తి కల్పించారు కైలాష్ సత్యార్థి. ప్రపంచవ్యాప్తంగా 144 దేశాలలో 83,000 కంటే ఎక్కువ మంది పిల్లల హక్కులను పరిరక్షించడం కోసం పనిచేశారు. సత్యార్థికి ఇంటర్నేషనల్ సెంటర్ ఆన్ చైల్డ్‌తో కూడా అనుబంధం ఉంది. ఈ సంస్థ అనేక సామాజిక సంస్థల, ఉపాధ్యాయుల మరియు ట్రేడ్ యూనియన్‌ల సమూహం. ఇది విద్య వ్యాప్తి కోసం అంతర్జాతీయంగా ప్రచారాలను ప్రారంభించింది.
సత్యార్థి బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రచారం :
మీడియా నివేదికల ప్రకారం.. కైలాష్ 'రుగ్‌మార్క్'ని కూడా స్థాపించాడు, దీనిని 'గుడ్‌వీవ్' అని కూడా పిలుస్తారు. రుగ్‌మార్క్ 1980, 1990లలో యూరప్ మరియు అమెరికాలో ఒక అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. బాల కార్మికులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఉత్పత్తుల వినియోగాన్ని నిరుత్సాహపరిచే లక్ష్యంతో.. సత్యార్థి బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. బాల కార్మికులకు వ్యతిరేకంగా ఉద్యమాలను 'అందరికీ విద్య' హక్కుతో అనుసంధానించడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారు.