మీ పాన్‌కు ఆధార్‌ లింక్‌ చేయలేదా..? అయితే 10 వేల జరిమానా కట్టాల్సిందే..

PAN card holders could be fined ₹10,000 for not linking it with Aadhaar. మీరు ఆధార్‌ కార్డులో పాన్‌ లింక్‌ చేయలేదా..?

By Medi Samrat  Published on  27 Feb 2021 5:31 AM GMT
మీ పాన్‌కు ఆధార్‌ లింక్‌ చేయలేదా..? అయితే 10 వేల జరిమానా కట్టాల్సిందే..

మీరు ఆధార్‌ కార్డులో పాన్‌ లింక్‌ చేయలేదా..? అయితే వెంటనే చేసుకోండి. లేకపోతే చిక్కుల్లో చిక్కే ప్రమాదం ఉంది. ఎందుకంటే భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానం చేయకపోతే పాన్‌ కార్డును రద్దు చేస్తామని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయాలని, బ్యాంకు అకౌంట్‌కు, అలాగే ఇతర బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల జరపడం పై పాన్‌ కార్డు తప్పనిసరి అయింది. అయితే ముందుగా పాన్‌ కార్డుకు ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో గడువు విధిస్తూ వస్తోంది. అయితే ఆధార్ కార్డుతో పాన్‌ కార్డు లింక్‌ చేయడానికి 2021 మార్చి 31 వరకు గడువు విధించింది ఆదాయపు పన్ను శాఖ. ఈ గడువులోగా అనుసంధానం చేయకపోతే 2021 ఏప్రిల్‌ 1 నాటికి మీ పాన్‌ కార్డు రద్దవుతుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. అయితే రద్దయిన పాన్‌ కార్డు కోసం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది.

రద్దయిన పాన్‌ కార్డు కలిగిన వారు పాన్‌ కార్డు లేనివారిగా పరిగణిస్తామని పేర్కొంది. ఇక ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 272బి కింద వారికి రూ.10వేల జరిమానా కూడా విధిస్తామని స్పష్టం చేసింది. ఒక వేల మీరు బ్యాంకుకు వెళ్లి రూ.50వేల వరకు డిపాజిట్‌ చేసే సమయంలో పాన్‌ కార్డు నెంబర్‌ తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. మీరు అనుసంధానం చేయకుండా మీ కార్డు రద్దయితే ఆ నెంబర్‌ను తీసుకోదు. పైగా జరిమానా కట్టాల్సి ఉంటుందని బ్యాంకు వాళ్లే మీకు సూచిస్తారు.


ఎస్‌ఎంఎస్‌ ఇలా చేయండి..

ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా పాన్‌ ఆధార్‌ లింక్‌ చేసుకోవచ్చు. ఇందు కోసం మీ రిజస్టర్‌ మొబైల్‌ న ఎంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్ చేసి మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్పేస్ ఇచ్చి మీ 10 అంకెల పాన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయండి. దీన్ని 567678 లేదా 56161 నంబర్కు SMS పంపించండి. వెంటనే మీ ప్రాసెస్‌ పూర్తయిట్లు చూపిస్తుంది. ఇక వెంటనే మీ ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం అయినట్లు మీ మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.


Next Story